Hyderabad: ఉద్యోగుల పేరుతో అప్పులు.. బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ..


హైదరాబాద్ ఐటీ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్(hyderabad) పెట్టుబడులు పెడుతోన్నాయి. పెద్ద పెద్ద సంస్థలే కాదూ.. చిన్న ఐటీ కంపెనీలు పట్నంలో పుట్టగోడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలా పుట్టగోడుగుల్లా పుట్టుకోస్తున్న కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపి డబ్బులు దండుకుని బోర్డు తిప్పేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇన్సోఫి అనే  సాప్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు లబోతిబోమంటున్నారు. ఈ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. 

అయితే ఈ ఐటీ కంపెనీ తమ సంస్థల పని చేస్తున్న ఉద్యోగుల పేరుపై అప్పులు కూడా తీసుకుంది. దాదాపు 650 మంది పేరు మీద రూ. 4 లక్షల చొప్పున  అప్పు తీసుకుంది. మరో 50 మంది పేరు మీద రూ.10 లక్షల అప్పు తీసుకుంది. కంపెనీ బోర్డు తిప్పేయడంతో అప్పులు ఉద్యోగుల మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు వీరే అప్పు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు కొంత మంది ఉద్యోగులకు ట్రైనింగ్ పేరు ఏడాది కాలంగా జీతాలు కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. 

ఏం చేయాలో తెలియని ఉద్యోగులు మంగళవారం ఇన్సోఫి కార్యాలయం ముదు ధర్నాకు దిగారు. దాదాపు రెండెళ్లుగా సాలరీ ఇవ్వకపోగా.. తమ పేరుపై అప్పు తీసుకుని మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను టర్మినేట్ చేస్తూ కంపెనీ నుంచి ఈమెయిల్స్ వచ్చాయని వారు తెలిపారు. యాజమాన్యం తమ పేరుపై తీసుకున్న అప్పులు ఎవరు చెల్లించాలని ఉద్యోగులు ప్రశ్నించారు. ఉద్యోగులకు తెలియకుండానే యాజమాన్యం వారి పేరుపై అప్పులు తీసుకున్నాయా.. ఉద్యోగులకు తెలిసే అప్పు తీసుకున్నారా తెలియాల్సి ఉంది. 

ఇన్ఫోసి కంపెనీ బోర్డు తిప్పేయడం  హైటెక్ సిటీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో ఇప్పుడు కంపెనీలు బోర్డు తిప్పేయడం చర్చనీయంశంగా మారింది. 


కామెంట్‌లు